సంక్రాంతి రేసు నుండి మరో సినిమా ఔట్!

32
movie

కరోనా థర్డ్ వేవ్‌ ప్రభావం సినిమా ఇండస్ట్రీపై స్ఫష్టంగా కనిపిస్తోంది. కరోనా దెబ్బకు ఇప్పటికే పెద్ద సినిమాలు వాయిదా పడగా తాజాగా మరో సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు రూపొందించిన ‘7 డేస్ 6 నైట్స్’ సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది. సుమంత్ అశ్విన్, మెహర్ చావల్, రోహన్, కృతికా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ సమర్పణలో, వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పతాకంపై సుమంత్ అశ్విన్, రజనీకాంత్ కలిసి నిర్మిస్తున్నారు.

కరోనా పాజిటివ్ కేసుల కారణంగా విడుదలను వాయిదా వేస్తున్నట్టు..త్వరలో మళ్ళీ అధికారికంగా కొత్త తేదీని ప్రకటించనున్నట్టు తెలిపారు. కరోనా ప్రభావంతో రాధే శ్యామ్,ఆర్ఆర్ఆర్, తమిళ సినిమాలు ‘వలిమై’, ‘సామాన్యుడు’ తప్పుకున్నాయి.