ఫిలిం ఫేర్ అవార్డుల నామినేష‌న్స్ విడుద‌ల‌

236
Filmfare 2018
- Advertisement -

సినిమా ఇండ‌స్ర్టీలో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారికి అవార్డులు ఇస్తూ వారిని ఎంక‌రేజ్ చేస్తూంది ఫిలిం ఫేర్. ఈ ఫిలిం ఫేర్ అవార్డుల కార్య‌క్ర‌మం ఈఏడాదితో 65వ సంవ‌త్సారానికి చేరుకుంది. 65వ ద‌క్షిణ భార‌త ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్య‌క్ర‌మం హైద‌రాబ‌ద్ లోని ఇంట‌ర్నేష‌నల్ క‌న్వేన్ష‌న్ సెంటర్ లో జూన్ 16 వ తేదిన ఈఅవార్డుల ప్ర‌ధాన కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈఅవార్డుల ప్ర‌ధానోత్స‌వం కార్య‌క్ర‌మానికి క‌న్న‌డ‌, మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించిన న‌టీన‌టులు పెద్ద ఎత్తున హాజ‌రుకానున్నారు.

film faire

ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప‌లు విభాగాల‌కు సంబంధించి అవార్డుల‌ను ప్ర‌ధానం చేయ‌నున్నారు ఫిల్మ్ ఫేర్. వివిధ విభాగాల్లో నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా పూర్త‌యిపోయినట్లు తెలిపారు. నామినేష‌న్స్ కి సంబంధించిన వివ‌రాలు కూడా వెల్ల‌డించారు. టాలీవుడ్ లో గ‌త సంవ‌త్స‌రం వ‌చ్చిన సినిమాలలో ప‌లు సినిమాలు నామినేష‌క్స్ కి అర్హ‌త సాధించాయి. ఫిల్మ్ ఫేర్ అవార్డుల‌కు నామినేట్ అయిన వారిలో టాలీవుడ్ కి సంబంధించిన ప‌లువురు వివరాలు..
ఉత్త‌మ చిత్రంః
అర్జున్ రెడ్డి, బాహుబ‌లి2, ఫిదా, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, ఘూజీ, శ‌త‌మానం భ‌వతి
ఉత్త‌మ న‌టుడుః

ఇండ‌స్ట్రీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన నటీ నటులకు అవార్డులను ఇస్తూ , వారిని ఎంకరేజ్ చేసే ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమం 65వ
ఉత్తమ నటుడు :
చిరంజీవి – ఖైదీ నెంబర్ 150, జూనియర్ ఎన్టీఆర్ – జై లవకుశ, నందమూరి బాలకృష్ణ – గౌతమీపుత్ర శాతకర్ణి, ప్రభాస్ – బాహుబలి 2, వెంకటేష్ – గురు, విజయ్ దేవరకొండ – అర్జున్ రెడ్డి
ఉత్త‌మ న‌టిః
అనుష్క – బాహుబలి2, నివేధా థామస్ – నిన్నుకొరి, రకుల్ ప్రీత్ సింగ్ – రారండోయ్ వేడుక చూద్దాం, రితికా సింగ్ – గురు, సాయి పల్లవి – ఫిదా
ఉత్త‌మ ద‌ర్శ‌కులుః

క్రిష్ (గౌతమీపుత్ర శాతకర్ణి),రాజమౌళి -(బాహుబలి 2),సందీప్ వంగ (అర్జున్ రెడ్డి),సంకల్ప్ రెడ్డి (ఘాజీ),సతీష్ వేగేష్న (శతమానం భవతి),శేఖర్ కమ్ముల (ఫిదా)
ఉత్తమ గీత రచయిత :
చైతన్య పింగాలి: ఊసుపోదు (ఫిదా)
చంద్రబోస్ – నువ్వేలే నువ్వేలే (జయ జానకి నాయక)
చంద్రబోస్ – రావణ (జై లవకుశ)
ఎం ఎం కీరవాణి – దండాలయ్య (బాహుబలి2)
రామజోగయ్య శాస్త్రి – శతమానం భవతి (శతమానం భవతి)
శ్రేష్ఠ – మధురమే (అర్జున్ రెడ్డి)

 

- Advertisement -