ప్రతి ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. సౌత్, నార్త్ పరిశ్రమలకి సంబంధించి విడివిడిగా ఈ వేడుక జరగుతూ వస్తుంది. గత ఏడాది జూన్‌లో 64వ జియో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2017 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇక జనవరి 20న 2017 సంవత్సరానికి గాను 63వ జియో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2018 వేడుక ముంబయిలో జరిగింది. బాలీవుడ్‌కి చెందిన పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగిన ఈ వేడుకలో చిత్రాలు, నటులు, ఇతర విభాగాలకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. ఆయన ఆప్తమిత్రుడు, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. ఈ అవార్డు వేడుకలో వివిధ భాగాలకి సంబంధించి ప్రకటించిన అవార్డుల జాబితా ఇలా ఉంది.
ఉత్తమ చిత్రం: హిందీ మీడియం
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్ అవార్డ్): న్యూటన్
ఉత్తమ నటుడు: ఇర్ఫాన్ ఖాన్ (హిందీ మీడియం)
ఉత్తమ నటి: విద్యాబాలన్ (తుమ్హారి సులు)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ అవార్డ్): రాజ్‌కుమార్ రావ్ (ట్రాప్డ్)
ఉత్తమ నటి (క్రిటిక్స్ అవార్డ్): జైరా వాసిం (సీక్రెట్ సూపర్‌స్టార్)
ఉత్తమ దర్శకత్వం: అశ్వినీ అయ్యర్ తివారీ (బరేల్లీ కి బర్ఫీ)
ఉత్తమ ఆరంగేట్ర దర్శకురాలు: కొంకణ సేన్‌శర్మ (ఎ డెత్ ఇన్ ద గంజ్)
ఉత్తమ సహాయ నటుడు: రాజ్‌కుమార్ రావ్ (బరేల్లీ కి బర్ఫీ)
ఉత్తమ సహాయ నటి: మెహెర్ విజ్ (సీక్రెట్ సూపర్‌స్టార్)
ఉత్తమ డైలాగ్ రచయిత: హితేశ్ కేవాల్య (శుభ్ మంగళ్ సావ్ధాన్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: సుభాశిష్ భుటియాని (ముక్తి భవన్)
ఉత్తమ ఒరిజనల్ స్టోరీ: అమిత్ న్యూటన్ (న్యూటన్)
ఉత్తమ నటుడు (షార్ట్ ఫిల్మ్): జాకీ ష్రాఫ్ (ఖుల్జీ)
ఉత్తమ నటి (షార్ట్ ఫిల్మ్): షెఫాలీ షా (జ్యూష్)
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (పీపుల్స్ ఛాయిస్ అవార్డ్): అనాహత్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (ఫిక్షన్): జ్యూస్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (నాన్ ఫిక్షన్): ఇన్విజబుల్ వింగ్స్
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: ప్రీతమ్ (జగ్గా జాసూస్)
ఉత్తమ నేపథ్య సంగీతం: ప్రీతమ్ (జగ్గా జాసూస్)
ఉత్తమ గాయకుడు: అరిజిత్ సింగ్ (రోక్ నా రుకే నైనా – బద్రీనాథ్ కి దుల్హానియా)
ఉత్తమ గాయని: మేఘనా మిశ్రా (నచిది ఫిరా – సీక్రెట్ సూపర్‌స్టార్)
ఉత్తమ లిరిక్స్: అమితాబ్ బట్టాచార్య (ఉల్లు కా పట్టా – జగ్గా జాసూస్)
జీవితకాల సాఫల్య పురస్కారం: మాలా సిన్హా, బప్పి లహరి
ఉత్తమ కొరియోగ్రఫీ: విజయ్ గంగూలీ, రూయెల్ డౌసన్ వరిందని
ఉత్తమ యాక్షన్: టామ్ స్ట్రూథెర్స్ (టైగర్ జిందా హై)
ఉత్తమ ఛాయాగ్రహణం: సిర్షా రాయ్ (ఎ డెత్ ఇన్ ద గంజ్)
ఉత్తమ ఎడిటింగ్: నితిన్ బైద్ (ట్రాప్డ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: పారుల్ సోంధ్ (డాడీ)
ఉత్తమ సౌండ్ డిజైన్: అనిష్ జాన్ (ట్రాప్డ్)
ఉత్తమ కాస్ట్యూమ్: రోహిత్ చతుర్వేది (ఎ డెత్ ఇన్ ద గంజ్)