కేజ్రీవాల్ కు గట్టి ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

ఆమ్‌ ఆద్మీ పార్టీ  ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. లాభదాయక పదవుల్లో కొనసాగిన 20 మంది ఎమ్మెల్యేలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ అనర్హత వేటు వేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఆదివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.  ఈ 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో, ఆయా అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉపఎన్నిక నిర్వహించనున్నారు.

కాగా, ఈ ఇరవై మంది ఎమ్మెల్యేలు పార్లమెంటు సెక్రటరీలుగా లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నారని, వీరిని అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్ట్రపతికి కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజుల క్రితం సిఫారసు చేసింది.  63 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి 20 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుతో ప్రస్తుతం వారి బలం 43కు చేరింది.

- Advertisement -

Related Articles

Gallery

Most Popular

- Advertisement -

తాజా వార్తలు