ఏపీలో కొత్తగా 458 మందికి కరోనా..

51
corona

ఆంధ్రపదేశ్‌లో గడచిన 24 గంటల్లో 69,062 కరోనా పరీక్షలు నిర్వహించారు. 458 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 98 కేసులు వెల్లడయ్యాయి. కృష్ణా జిల్లాలో 78, తూర్పు గోదావరి జిల్లాలో 54, గుంటూరు జిల్లాలో 41 కేసులు గుర్తించారు. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో 13 చొప్పున కేసులు గుర్తించారు. అదే సమయంలో 534 మందికి కరోనా నయం కాగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,77,806 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,66,359 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 4,377కి తగ్గింది. మొత్తం మరణాల సంఖ్య 7,070కి చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది.