బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ మృతి..

35
dilip-kumar

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మృతి చెందారు. ఇవాళ ఉదయం 7 : 30 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు. దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు.

దేవదాసు, ఆజాద్ వంటి సినిమాల్లో నటించి అగ్రహీరోగా గుర్తింపు పొందారు దిలీప్ కుమార్ . 1944లో బాంబే టాకీస్ నిర్మించిన జ్వార్ బాటా తో దిలీప్ కుమార్ చిత్రసీమలో ప్రవేశించారు. రాజ్ కపూర్ తో కలసి అందాజ్ లో నటించిన దిలీప్, దేవానంద్ తో కలసి ఇన్సానియత్ లో అభినయించారు. తనకంటే వయసులో 22 సంవత్సరాలు చిన్నదైన నటి సైరాబానును దిలీప్ వివాహమాడారు. 1981 చివరలో ఆస్మాసాహిబా అనే ఆమెను కూడా పెళ్ళాడారు. అయితే ఆ సమయంలో ఎంతోమంది దిలీప్ సన్నిహితులు సైతం సైరాబాను పక్షాన నిలిచారు. దాంతో 1983లో ఆస్మాకు విడాకులు ఇచ్చారు దిలీప్. కళాకారుల విభాగంలో 2000 సంవత్సరంలో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన దిలీప్ ఆరేళ్ళ పాటు ఆ పదవిలో కొనసాగారు.