టాలీవుడ్‌లో మరపురాని సినిమాల్లో ఓ మూవీ బొబ్బిలిరాజా. వెంకటేష్ హీరోగా నటించిన ఈ మూవీ విడుదలై నేటికి 30ఏళ్ళు. డి.రామానాయుడు సమర్ఫణలో డి.సురేష్ బాబు నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై నిర్మించిన బొబ్బలి రాజా చిత్రానికి బి.గోపాల్ దర్శకత్వం వహించారు.
1990 సెప్టెంబర్ 14 న విడుదలైన ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇళయరాజా సంగీతం కథ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. వెంకటేష్ కెరీర్‌నే మార్చివేసింది. అత్తా అల్లుళ్ల కథ మధ్య జరిగే పోరుకు తల్లి కోరికను తీర్చడం నేపథ్యంలో పరుచూరి వేంకటేశ్వరరావు కథను అందించారు. వాణిశ్రీ, సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, శివాజీ రాజా ముఖ్యపాత్రల్లో నటించారు.
సినిమా ముహుర్తపు షాట్ క్లాప్ కమల్ హాసన్ కొట్టగా శోభన్ బాబు 200 రోజుల వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తమిళ్, హిందీలో డబ్ అయిన ఈ మూవీ అక్కడ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 1990లో విడుదలైన చిరంజీవి జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా వసూళ్లను క్రాస్ చేసింది బొబ్బిలిరాజా.