’24 కిస్సెస్’ న్యూ టీజర్..

231
- Advertisement -

టాలీవుడ్‌లో తాజాగా వస్తున్న మూవీ ’24 కిస్సెస్’. అరుణ్ అదిత్ – హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాని అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి తెరకెక్కిస్తున్నారు. ఇదివరకు ఆయన మిణుగురులు అనే ఓ మంచి సినిమాని తీశాడు. ఈసారి మాత్రం దానికి పూర్తిభిన్నమైన సినిమాని తీస్తున్నాడు. ఈ మూవీ నుండి తాజాగా మరో టీజర్‌ని విడుదల చేశారు. ఈ సినిమా పేరులోనే బోలెడన్ని ముద్దులున్నాయి.

24 Kisses Telugu movie

అయితే ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. అందులో ఒకట్రెండు కిస్సులు మాత్రమే ఉన్నాయి. కానీ దానికి ఎక్స్ టెన్షన్ గా మరో టీజర్‌ని విడుదల చేశారు చిత్ర బృందం. అందులో బోలెడన్ని ఘాటు ముద్దులున్నాయి. నీకో సగం.. నాకో సగం ఈ ఉత్సవం అంటూ క్యాప్షన్ పెట్టారు ఈ సినిమాకి. సగం సగం అంటే ఏంటనేది అర్థం కాలేదు కానీ.. ఉత్సవం అంటే ఇది ముద్దులకి సంబంధించిన ఉత్సవమే అనేది మాత్రం క్లారిటీగా అర్థమవుతోంది.

- Advertisement -