వాసాల‌మ‌ర్రిలో స‌హ‌పంక్తి భోజ‌నం చేసిన సీఎం కేసీఆర్..

215
cm kcr

మంగళవారం సీఎం కేసీఆర్‌ యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని వాసాల‌మ‌ర్రిలో ప‌ర్య‌టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా గ్రామంలోని కోదండ రామాల‌యంలో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంతరం వాసాల‌మ‌ర్రి గ్రామ‌స్తుల‌తో క‌లిసి సీఎం కేసీఆర్ స‌హ‌పంక్తి భోజ‌నం చేశారు. ఇక భోజ‌నం చేస్తున్న మ‌హిళ‌ల వ‌ద్ద‌కు వెళ్లి సీఎం కేసీఆర్ వారి యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. భోజ‌నాలు ఎలా ఉన్నాయ‌ని అడిగారు. కేసీఆర్ ఒక సామాన్యుడిలా వారి వ‌ద్ద‌కు వెళ్లి ఆప్యాయంగా ప‌లుక‌రించ‌డంతో మ‌హిళ‌లు సంతోషం వ్య‌క్తం చేశారు. గ్రామంలోని 3 వేల మందికి ఒకేసారి భోజ‌న ఏర్పాట్లు చేశారు.

ఈ భోజ‌న కార్యక్రమంలో 23 ర‌కాల వంట‌కాలను వడ్డించారు.. మ‌ట‌న్, చికెన్, ఆకుకూర‌లు, బోటీ క‌ర్రి, చేప‌లు, త‌ల‌కాయ కూర‌, కోడిగుడ్డు, రెండు ర‌కాల స్వీట్లు, పాల‌క్ ప‌న్నీరు, బిర్యానీ, ఆలుగ‌డ్డ‌, పులిహోర‌, సాంబార్, పండ్ల ర‌సాలతో పాటు ప‌లు వంటకాలు వడ్డించారు.