- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 20,551 కరోనా కేసులు నమోదుకాగా 80 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,41,07,588కి చేరగా 4,34,45,624 మంది బాధితులో వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,35,364 కేసులు యాక్టివ్గా ఉండగా ఇప్పటివరకు 5,26,600 మంది మరణించారు.
రోజువారీ పాజిటివిటీ రేటు 5.14 శాతానికి చేరగా మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 205.59 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
- Advertisement -