CWG 2022..సత్తా చాటిన భారత ఆటగాళ్లు

24
CWG
- Advertisement -

కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. పతకాల పంట పండిస్తూ సరికొత్త చరిత్ర లిఖించారు. బుధవారం హైజంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్యం గెలిస్తే.. గురువారం లాంగ్‌జంప్‌లో మురశీ శ్రీశంకర్‌ రజతం సొంతం చేసుకున్నాడు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఈ రెండు విభాగాల్లో భారత్‌కు పతకాలు సాధించిన అథ్లెట్స్‌గా రికార్డు సృష్టించాడు.

ఇక కేరళ యువకుడు మురళీ శంకర్‌.. ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. ఇక బహమాస్‌కు చెందిన లకాన్‌ నైర్న్‌ స్వర్ణం గెలుచుకున్నాడు. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో సుధీర్ గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఆసియా పారా ఒలింపిక్స్‌ కాంస్య విజేత అయిన 27 ఏండ్ల సుధీర్.. కామన్వెల్త్‌ గేమ్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

- Advertisement -