బంగారం కొనుగోలు దారులకు శుభవార్త..

4
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారంపై వెయ్యి రూపాయలు తగ్గగా.. 24 క్యారట్ల బంగారంపై రూ.1,090 తగ్గింది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 1,090 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. వెయ్యి తగ్గింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.78,900గా ఉండగా 24 క్యారట్ల ధర రూ.86,070గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.79,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ.86,220గా ఉంది.

బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో కేజీ వెండి ధర రూ.1,08,000గా ఉంది.

Also Read:NBK:తుళ్లూరులో క్యాన్సర్ ఆస్పత్రి

- Advertisement -