2023లో తిరుగులేని టీమిండియా!

40
- Advertisement -

ఈ ఏడాది టీమిండియాకు బాగానే కలిసొచ్చింది. జట్టులోని అందరూ ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తూ మెరుగైన ఫలితాలను నమోదు చేశారు. ఈ ఏడాది జరిగిన రెండు అంతర్జాతీయ టోర్నీలలో జట్టు ఓడిపోయినప్పటికీ ఆటగాళ్లు మాత్రం వారి ఆటతీరుతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఈ ఏడాది జరిగిన టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ, అలాగే వరల్డ్ కప్ మిస్ తృటిలో చేజారిపోయాయి. ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ లో ఆడిన ప్రతి మ్యాచ్ లోని తిరుగులేని విజయం సాధించి చివరి ఫైనల్ లో మాత్రం ఓటమి చవి చూసింది. అయినప్పటికి జట్టు ప్రదర్శనపై యజమాన్యం, అభిమానులు అందరూ సంతృప్తిగానే ఉన్నారు. .

ఇక ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. వన్డే ర్యాంకింగ్స్ లో శుబ్ మన్ గిల్ నెంబర్ ఒన్ స్థానంలో ఉండగా, టీ20 లలో సూర్య కుమార్ యాదవ్ అగ్ర స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్స్ విషయానికొస్తే మహ్మద్ సిరాజ్ అగ్రస్థానంలో ఉండగా, ఆల్ రౌండర్ల జాబితాలో జడేజా మెరుగైన స్థానంలో ఉన్నాడు.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఈఏడాది టీమిండియా ఆటగాళ్లు మెరుగైన ర్యాంకింగ్స్ లోనే ఉన్నారు. ఇక ఈ ఏడాది మొత్తం 7 టెస్టులు ఆడిన టీమిండియా అందులో మూడు విజయాలు, రెండు ఓటములను చవి చూసింది. ఇక మరో రెండు టెస్ట్ మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. ఇక వన్డేల విషయానికొస్తే మొత్తం 35 వన్డేలు ఈ ఏడాది ఆడగా అందులో 27 విజయాలు, 7 ఓటములు, ఒకటి రద్దుగా ఉన్నాయి. టీ20 లలో మొత్తం 23 మ్యాచ్ లకు గాను 15 గెలుపు, 7 ఓటమి, 1 రద్దు.. గా టీమిండియా ఖాతాలో ఉన్నాయి మొత్తం మీద ఈ ఏడాది టీమిండియాకు బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి.

Also Read:చేవెళ్లపై గులాబీ జెండా ఎగరాలి

- Advertisement -