2022వ సంవత్సరం ముగిసేనాటికి టాప్‌లో ఉన్న మలయాళ సినిమాలు. అత్యంత ప్రేక్షక ఆదరణ పొందిన చిత్రాలుగా నిలిచాయి. మమ్ముట్టి దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలు ప్రేక్షకాదరణే కాదు భారీ వసూళ్లను సైతం సాధించించాయి. మరియు ఇవి డబ్ కూడా అయ్యాయి. మీరు చూడండి.
జనగణమన
పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా నటించిన సినిమా జనగణమన. డిజోజోస్ ఆంటోని దర్శకత్వం తెరకెక్కిన సినిమా బూటకపు ఎన్‌కౌంటర్‌ను ఏవిధంగా ఒక రాజకీయ నాయకుడు తనకు అనుకులంగా మార్చుకున్నారనేది ఇతివృత్తం. ఈ సినిమా ప్రేక్షకుల నుండి ప్రశంసలే గాక విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
హృదయం
మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ మరియు కళ్యాణిప్రియదర్శని ప్రధాన పాత్రలో నటించారు. ఇంజినీరింగ్ కాలేజీలో చేరిన ఓ యువకుడి చూట్టూ తిరుగుతోంది ఈ ప్రేమ కథ. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు.
సూపర్ శరణ్య
ఈ సినిమాను గిరీష్ ఎడి దర్శకత్వం వహించారు. ఇందులో అప్‌కమింగ్ ఏజ్‌లో జరిగే విభిన్నమైన కథాంశంను ఎంచుకున్నారు. అనశ్వర రాజన్ సూపర్ శరణ్యగా నటించారు.
మెప్పడియన్
మెకానిక్ కమ్ గ్యారేజ్ యజమానికి పెద్ద ల్యాండ్ డీల్ వస్తూనే హీరోను ఇబ్బందులో పడేస్తుంది. ఇది ఒక సాధారణ వ్యక్తి యొక్క పోరాటాలను వాస్తవిక పద్దతిలో చిత్రీకరించారు. విష్ణు మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఉన్ని ముకందన్ ప్రధాన పాత్రలో నటించారు.
భూతకాలం
షేన్ నిగమ్ రేవతి నటించిన భూతకాలం మలయాళ సినిమాలల్లో సూపర్ హిట్గా నిలిచింది. సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ హార్రర్ థ్రిల్లర్ సినిమా విమర్శకుల సైతం ప్రశంసలు అందుకుంది.
భీష్మపర్వం
మమ్ముట్టి నటించిన యాక్షన్ సినిమా. కొచ్చిలో అత్యంత ప్రభావవంతమైన కుటుంబానికి అధిపతి అయిన వ్యక్తి కథనే భీష్మపర్వం. ఈ సినిమాను అమల్ నీరద్ దర్శకత్వం వహించారు.
వందనం
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశంగా సాగే వందనం సినిమాలో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాను రోషన్ ఆండ్రూస్ ఈ సినిమాను తీశారు. ఇది ఆద్యంతం ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురిచేస్తోంది. ఖచ్చితంగా మీరు చూడదగిన సినిమా.
ఒరుతీ
వికే ప్రకాష్ దర్శకత్వం వహించిన ఒరుతీ సినిమా. ఇది ఒక సాధారణ మహిళ చుట్టూ జరిగే అసాధారణ పరిస్థితులను ఏవిధంగా చేదించింది అనే కథాంశంగా రూపొందింది. ఈ సినిమాలో నటి నవ్య నాయర్ ప్రధాన పాత్ర పోషించింది.
మకల్
మకల్ ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో జయరామ్ మీరా జాస్మిన్ దేవిక సంజయ్‌ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా తన కుమార్తెతో నివసించే ఒక మహిళ కథగా చెప్పవచ్చు. అంతలోనే ఆమె తండ్రి గల్ఫ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఏవిధంగా వారి జీవితాలను మారుస్తుందనే తెలిపే కథను సత్యన్ అంతికాడ్ చక్కగా తెరకెక్కించారు.
ఇవి కూడా చదవండి…
ది కేరళ స్టోరీపై వివాదం ఎందుకు….
ఇలియానా కళాతృష్ణ తగ్గలేదట
వినిపించి ఒప్పించడం కష్టమే.