గ్రేటర్‌కు మహర్దశ…

246
20000 crore projects in Hyderabad city
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో భాగంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, రాష్ట్రానికి జీవనాడి అయిన హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మారుస్తామనన్న ఘనమైన లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ విశ్వనగర సాధన దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఒకవైపు హైదరాబాద్లో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనుల మేలు కలయికగా, దీర్ఘకాలికంగా హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పన పైన దృష్టి సారించింది. ఇందుకోసం సుమారు 20 వేల కోట్ల రూపాయాల నిధులను ఖర్చు చేయనున్నది. విశ్వనగరం అంటే ఒక్క రోజులోనో, ఒక్క ఏడాదిలోనో నిర్మితం కాదంటూనే, ఈ కలను సాకారం చేసుకునేందుకు స్వల్పకాలిక, దీర్షకాలిక లక్ష్యాల మేరకు పనులు చేపడుతున్నది. హైదరాబాద్ నగరాన్ని లవబుల్ మరియు దీవులు సిటీ గా మార్చడమే విశ్వ నగర లక్ష్యంమంటూ పలు సందర్భాల్లో తెలుపడం జరిగింది.

20000 crore projects in Hyderabad city

ఒకవైపు నగరంలో ప్రస్తుతమున్న మౌలిక వసతులను మెరుగుపరచడంతో, నగర పెరుగుదలను తట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తూ అమేరకు ప్రాజెక్టులను చేపడుతున్నది. ముఖ్యంగా రోడ్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, మురుగునీటి నిర్వహాణ, లైటింగ్ వంటి ప్రాథమిక అంశాలపైన ఈ ప్రాజెక్టులుండబోతున్నాయి. ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, ఉన్న వాటిని మరింత అభివృద్ది చేయడం లక్ష్యంగా ప్రభుత్వం హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.ఈ కార్పోరేషన్ ద్వారా 1500 కోట్లు ఖర్చు చేయనున్నది. వీటి ద్వారా సూమారు 300 కీలో మీటర్ల మేర అంతర్జాతీ ప్రమాణాలో కూడిన వైట్ టాంపిగ్ రోడ్ల నిర్మాణం జరగనున్నది.

20000 crore projects in Hyderabad city

దీంతోపాటు యస్.ఆర్.డీ.పీ అనే కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ అభివృద్ధి కూడళ్ల అభివృద్ధి, నూతన రోడ్ల ఏర్పాటు పైనా పెద్ద ఎత్తున ఖర్చు చేయబోతున్నది. యస్.ఆర్.డీ.పీ ద్వారా ఇప్పటికే కోట్ల 1700 పనులకు టెండర్లు పూర్తయ్యి, పలు చోట్ల పనులు మెదలయ్యాయి. వీటిలో భాగంగా ఏల్బీనగర్, మైండ్స్పేస్ జంక్షన్, అయ్యప్ప సోసైటీ, దుర్గం చెరువు వంటి చోట్ల పనులు నడుస్తున్నాయి. మరో 100 కోట్ల రూపాయల పనులకు డిపియార్లు పూర్తి అయ్యాయి. మరో 2500 కోట్ల రూపాయాల పనులకు డిపియార్లు సిద్దం అవుతున్నాయి.

20000 crore projects in Hyderabad city

రోడ్ల తర్వతా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా నీటి సరఫరా అంశాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జలమండలి ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులతోపాటు, మిషన్ భగీరథ అర్భన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నది. ఇందులోభాగంగా జల మండలి పరిసర(పాత) మున్సిపాలీలకు నీళ్లు అందించేందుకు సూమారు 1900 కోట్లుతో పనులు నడుస్తున్నాయి. ఈ పనులు వచ్చే వేసవినాటికి పూర్తి అయ్యే అవకాశం ఉన్నది. దీంతోపాటు మిషన్ భగీరథ ద్వారా అవుటర్ రింగ్ రోడ్డులోపలి గ్రామాలకు 628 కోట్లు, రింగ్ మెయిన్ కోసం 398 కోట్లను ఖర్చు చేయనున్నారు. మెత్తంగా నీటి సరఫరా కోసం సూమారు 2926 కోట్లను ఖర్చు చేయనున్నారు.

20000 crore projects in Hyderabad city

సంక్షేమ రంగంలో దేశానికి ఆదర్శంగా ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ పథకంలో హైదరాబాద్ నగరంలోనే లక్ష ఇళ్లను నిర్మాణం కాబోతున్నాయి ఇందుకోసం సుమారు 8225 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయి. ఇప్పటికే లక్ష ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తి అయ్యే దశలో ఉండగా, పలు చోట్ల పనులు సైతం ప్రారంభం అయ్యాయి. మెత్తం 109 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం జరగనుంది.

20000 crore projects in Hyderabad city

దీంతోపాటు నగరంలో ఏల్ ఈడీ లైట్లను వెలిగించేందుకు సుమారు 400 కోట్ల రూపాయలతో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీపాలవళి నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నా లక్ష్యంలో పనులు నడుస్తున్నాయి. నగరంలో వరద, మురికి నీటి నిర్వహాణపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం నాలా విస్తరణ, అభివృద్ది కార్యక్రమానికి 230 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ఇక మూసీ నది అభివృద్ది కోసం మూసి డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి, 1665 కోట్లకు పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చింది. పైన పెర్కోన్న నిధులకు అధనంగా ముఖ్యమంత్రి ఇచ్చిన ఏన్నికల హమీ మేరకు నగరానికి ప్రత్యేకంగా తాగునీటి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నారు.

20000 crore projects in Hyderabad city

ఈ మేరకు కేశవాపురం వద్ద నిర్మంచే తాగునీటీ రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రాథమికంగా 7వేల కోట్ల రూపాయల అంచనాలు సిద్ధం అయ్యాయి. తర్వరలోనే ఈ రిజర్వాయర్ డిపియార్ పూర్తి అవుతుంది. ఈ నిధుల కోసం ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ అర్ధిక సంస్ధలు, బ్యాంకులతో చర్చలు చేపట్టింది. జీహెచ్‌యంసీ తమ వనరులు ఉపయోగించుకుని, నిధుల సేరకరణ చేసేందుకు ఉన్న మార్గాలపైన పలు సంస్దలతో చర్చలు చేస్తున్నది. ప్రారంభం అయిన పనులు, ప్రారంభం కానున్న పనులపైన మంత్రి అనేక రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఈకార్యక్రమాల అమలు కోసం ప్రత్యేకంగా ప్రతి సోమవారం శాఖాధిపతులుతో సమావేశం నిర్వహిస్తున్నారు.

- Advertisement -