లడఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా బలగాలతో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందినట్లు ప్రకటించింది. జవాన్ల మృతిపై దేశమంతా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చైనా వస్తువలను బ్యాన్ చేయాలని పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చేపట్టారు ప్రజలు.
నెలన్నర ఉద్రిక్తతల అనంతరం వాస్తవాధీన రేఖవెంబడి ఇరు పక్షాలు వెనుకకు తగ్గుతున్న సమయంలో సోమవారం ఘర్షణ తలెత్తింది. ఇరు దేశాల సైనికులు రాత్రి రాళ్లు, రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో ఇరుదేశాల సరిహద్దులు రక్తసిక్తం అయ్యాయి.
సోమవారం గాల్వాన్, ప్యాంగాంగ్ సో ప్రాంతాల్లో బ్రిగేడ్ కమాండర్ల స్థాయి చర్చల అనంతరం గాల్వాన్‌లో లోయలో సైన్యాలను ఉపసంహరించుకుంటున్న సమయలో సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని భారత సైనిక అధికారులు తెలిపారు.1975 తర్వాత చైనా దాడిలో భారత సైనికులు చనిపోవటం ఇదే మొదటిసారి.ఇక ఈ ఘర్షణలో 43మంది చైనా సైనికులు మరణించారని సమాచారం.