15న కల్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ- మంత్రి జగదీశ్ రెడ్డి

152
Minister jagadish reddy
- Advertisement -

భారత్ చైనా బోర్డర్‌లో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందిన సూర్యపేట ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు భారత దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా సూర్యపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్న అయన విగ్రహన్ని ఈ నెల 15వ తేదీన అవిష్కరించనున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్ట్ చౌరస్తాలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సంతోష్ బాబు సూర్యపేట పేరును జాతీయ స్థాయికి తీసుకుపోయాడాని,దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ..వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారంగా జిల్లా కేంద్రంలోని ప్రముఖ కోర్ట్ చౌరస్తాలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -