కంటతడి పెట్టిస్తున్న సంతోష్ బాబు కూతురు అభిజ్ఞ..

447
santhosh daughter
- Advertisement -

చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మృతిచెందిన కల్నల్ సంతోష్ బాబుకు అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం సూర్యాపేటలో జరగనున్నాయి. ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్‌లో సంతోష్ బాబు పార్ధివదేహాన్నిహైదరాబాద్‌కు తీసుకురానుండగా అక్కడి నుండి సూర్యాపేటకు తరలించనున్నారు.

ఇక ఇవాళ ఉదయం సంతోష్ భార్య , పిల్లలు హైదరాబాద్ రాగా వారిని రిసీవ్ చేసుకున్న సీపీ సజ్జనార్ ప్రత్యేక వాహనంలో సూర్యాపేటకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక సూర్యాపేటలోని తమ నివాసంలో తండ్రి సంతోష్‌కి నివాళులు అర్పించారు కూతురు అభిజ్ఞ. తండ్రి ఫోటో ముందు చేతులు జోడించి నమస్కారం పెడుతున్న అభిజ్ఞ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంతోష్ బాబుకు 2010లో వివాహం జరగ్గా, ఆయనకు ఓ కూతురు(అభిజ్ఞ), కుమారుడు(అనిరుథ్) ఉన్నారు.కరోనా ప్రభావంతో కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది బంధువుల సమక్షంలోనే సంతోష్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.

- Advertisement -