సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.0’. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దడానికి 2150 వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ ఉపయోగించారు. 3000 మంది వి.ఎఫ్.ఎక్స్ టెక్నీషియన్స్.. 1000 టిపికల్ వి.ఎఫ్.ఎక్స్ షాట్ మేకర్స్ ఈ సినిమా కోసం పనిచేశారు.
గత ఆదివారం ఈ సినిమా మేకింగ్ వీడియోస్, పాట, ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. పూర్తిస్థాయి త్రీ డీ టెక్నాలజీతో.. 4డీ సౌండింగ్‌తో తెరకెక్కిన తొలి ఇండియన్ సినిమా `2.0`. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. `2.0` పాటలు, ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. సోషల్ మీడియాలో 2.0 ట్రైలర్, పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా పదివేల థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నారు. ఇక దుబాయ్‌లో ఒకే రోజున 100 ప్రీమియర్ షోలు ప్రదర్శించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓపెనింగ్స్ విషయంలోనే ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించాలనీ, సంచలన విజయం సాధించాలని భావిస్తున్నారు. ఇటీవల వదిలిన టీజర్ కి .. ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. రజనీ కెరియర్లోనే ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని అటు సినీ విశ్లేషకులు,అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.