ఏపీలో కొత్తగా 172 మందికి కరోనా..

44

ఆంధ్రపదేశ్‌లో గత 24 గంటల్లో 38,323 కరోనా పరీక్షలు నిర్వహించగా, 172 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 8,87,238 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,78,731 మంది వైరస్ ప్రభావం నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,357 మంది చికిత్స పొందారు. కరోనా మృతుల సంఖ్య 7,150కి పెరిగింది. అదే సమయంలో గత 24 గంటల్లో 203 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, కడప జిల్లాలో ఒకరు మరణించారు.

ఇక గత 24 గంటల్లో పాజిటీవ్ కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 39 కొత్త కేసులు వెల్లడయ్యాయి. విశాఖ జిల్లాలో 34, గుంటూరు జిల్లాలో 22, తూర్పు గోదావరి జిల్లాలో 21 కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కర్నూలు జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 4 కేసులు వచ్చాయని రాష్ట్ర వైద్య ఆర్యోగ్య శాఖ వెల్లడించింది.