- Advertisement -
దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 11,439 నమోదయ్యాయని తెలిపింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి లేదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు.
కరోనా నుంచి 1,306 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని….24 గంటల్లో కొత్తగా 1,076 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని… ఇప్పటి వరకు 377 మంది వైరస్‌తో చనిపోయారని తెలిపారు. దేశంలో 170 హాట్ స్పాట్ లు గుర్తించామని వెల్లడించారు.
ఈ నెల 20 నుంచి దశల వారీగా లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తామని…హాట్ స్పాట్స్ కోసం గైడ్ లైన్స్ విడుదల చేశామని వెల్లడించారు. దేశంలోని జిల్లాలను హాట్‌స్పాట్స్, నాన్హాట్స్పాట్స్, గ్రీన్ జోన్లుగా విభజించామని…హాట్ స్పాట్స్ ఏరియాలో ప్రతి ఇంటిని సర్వే చేస్తామని వెల్లడించారు.
- Advertisement -