ఉత్తరప్రదేశ్ లో రోజు రోజుకు అత్యాచారాలు పెగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక మూలన అక్కడ మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన వెలుగోలోకి వచ్చింది. ఓ 16 ఏళ్ల బాలికను కొంతమంది యువకులు అడవిలోకి తీసుకెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూలై 12న ఈ ఘటన జరగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఝాన్సీ పట్టణానికి సమీపంలోని ఓ పల్లెలో ఈ దారుణం జరిగింది. పొలం దగ్గర ఉన్న తన తల్లికి భోజనం తీసుకుని ఓ బాలుడిని తోడుగా తీసువెళ్తుంది ఓ బాలిక. అడవిలో నుంచి నడిచి వెళుతున్న ఈ ఇద్దరిని అడ్డుకుని,ఆ బాలికను ఇద్దరు యువకులు అడవిలోకి తీసుకెళ్లారు. మిగతా కొంతమంది యువకులు దూరంగా నిలబడి ఉన్నారు. దయచేసి నన్ను వదలండీ అని బతిమిలాడుతున్నా ఆ యువకులు లాకెళ్తున్నట్లు ఈ వీడియోలో తెలుస్తోంది. ఈ ఘటనను ఆ గుంపులోని ఓ యువకుడు వీడియో తీశాడు. మరి ఆ అమ్మాయిని అత్యాచారం చేశారా..? లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బాలికది, నిందితులది ఒకే ఊరుగా గుర్తించారు. ప్రస్తుతం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు మైనర్ అని పోలీస్ అధికారి కుల్దీప్ నారాయణ్ చెప్పారు.