- Advertisement -
టాంజానియాలో ఘోర ప్రమాదం జరిగింది. విక్టోరియా లేక్‌లో పడవ మునిగిన ఘటనలో 136 మంది మృతి చెందారు. వందలమంది గల్లంతయ్యారు. లేక్ విక్టోరియాలో ప్రయాణిస్తున్న పడవ కొద్దిసేపట్లో రేవుకు చేరుకుంటుందనగా ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 400 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం.
సహాయ సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం వరకు 126 మృత దేహాలను వెలికి తీశారని, మరికొన్నిటిని గుర్తించారని టాంజానియాæ రవాణా మంత్రి ఇసాక్ కమ్వెలె చెప్పారు. ఈ ప్రమాదం నుంచి 37 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -