- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్‌తో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువల వస్తున్నాయి. తాజాగా ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటో మొబైల్ సంస్థ ఫియట్ క్రిస్లర్ హైదరాబాద్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు మంత్రి కేటీఆర్.
ఫియట్ క్రిస్లర్ రూ.1100 కోట్ల పెట్టుబడి పెట్టనుందని, తొలిఏడాదే వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయని మంత్రి పేర్కొన్నారు.ఉత్తర అమెరికాలోని ప్రధాన కార్యాలయం తరువాత వెలుపలి దేశాల్లో ఏర్పాటు చేసే అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్‌లోనిదేనని ఆయన తెలిపారు. సమర్థవంతమైన ప్రభుత్వం, వ్యాపారానికి అనుమైన వాతావరణం, సరైన వసతులు ఉన్నందునే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి ప్రతిష్టాత్మక సంస్థలు ముందుకు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు.
- Advertisement -