బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 102 హైలైట్స్

46
episode 102

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 102 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 102వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యుల జర్నీని చూపిస్తు వారిని ఎమోషన్‌కు గురిచేశారు. ఇక వారు హౌస్‌లో ఇచ్చిన పర్ఫామెన్స్ ఆధారంగా వారిని గౌరవించారు బిగ్ బాస్.

తొలుత అఖిల్ జర్నీని చూపించారు. అఖిల్ గురించి అద్భుతంగా మాట్లాడిన బిగ్ బాస్ అతనిలో కాన్ఫిడెన్స్ నింపారు. అఖిల్ జర్నిలో మోనాల్‌తో ఆట‌పాట‌లు, అభితో గొడ‌వ‌లు, సోహైల్ త్యాగాలు అన్నీ చూపించడంతో అఖిల్‌ కంట‌త‌డి పెట్టుకున్నాడు. త‌ను ఎఫ‌ర్ట్స్ పెట్టి ఆడాన‌ని …గెలుపోట‌ములు త‌న‌ చేతిలో లేవ‌ని, కానీ ప్ర‌య‌త్నం మాత్రం ఎప్ప‌టికీ మానుకోలేద‌ని చెప్పాడు. చివర్లో నీకు నచ్చిన ఫొటోని తీసుకుని లోపలికి వెళ్లమని బిగ్ బాస్ చెప్పగా..టికెట్ టు ఫినాలే మెడల్ సాధించిన ఫొటోని హౌస్‌లోకి వెళ్లాడు అఖిల్.

తర్వాత వచ్చిన అభిజిత్ జర్నీని చూపించిన బిగ్ బాస్‌…ఆయన్నీ థ్రిల్ అయ్యేలా చేశాడు. మెచ్యూర్డ్ మ్యాన్ ఇన్ ది హౌస్ అనే టైటిల్ కూడా సాధించారని చెప్పారు బిగ్ బాస్. నీలాంటి పరపక్వత కలిగిన తెలివైన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నందుకు బిగ్ బాస్ చాలా గర్వపడుతున్నాడని చెప్పారు .బిగ్ బాస్. అనంతరం అభిజిత్ జర్నీ మొత్తాన్ని వీడియో రూపంలో చూపించారు బిగ్ బాస్. అనంతరం నా లైఫ్‌లో నేను తీసుకున్న బెస్ట్ నిర్ణయం ఇదే అంటూ భావోద్వేగానికి గురయ్యాడు అభిజిత్. ఇవాళ్టి ఎపిసోడ్‌లో మిగ‌తా ముగ్గురి జ‌ర్నీలు చూపించ‌నున్నారు.