జనవరి3..108వ ఇండియన్ సైన్స్‌ కాంగ్రెస్‌

55
- Advertisement -

మహిళా సాధికారతతో పాటు సుస్థిర అభివృద్ధికి సైన్స్‌ అండ్ టెక్నాలజీ అనే ప్రధాన థీమ్‌గా..108వ ఇండియన్స్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సు జరగనుంది. జనవరి 3న జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించనున్నట్టు పీఎంవో ప్రకటించింది. 1914లో ఇండియన్ సైన్స్‌ కాంగ్రెస్‌ మొదటి సెషన్‌ జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు.

రాష్ట్రసంత్‌ తుకాదేవ్‌ జీ మహారాజ్‌ నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించబడుతుంది. ఈ సారి సైన్స్ కాంగ్రెస్‌లో ఈసారి సుస్థిర అభివృద్ధి, మహిళా సాధికారత, దానిని సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్రపై చర్చ జరగనుంది. సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనే సభ్యులు విద్య, పరిశోధన, పరిశ్రమలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంపై చర్చిస్తారని పేర్కొంది.

సైన్స్ కాంగ్రెస్‌కు హాజరయ్యే సభ్యులు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే మార్గాలతో పాటు విద్య, పరిశోధన అవకాశాలు , ఆర్థిక భాగస్వామ్యంలో వారి సమాన హోదాను పెంపు మార్గాల గురించి చర్చించనున్నారు. ఈసదస్సులో మహిళా శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం నిర్ణయించబడింది. దీంతో పాటుగా పిల్లలలో శాస్త్రీయ ఆసక్తిని పెంపొందించడానికి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ కోసం బాలల రైతు గిరిజన సైన్స్‌ కాంగ్రెస్‌లు విడివిడిగా నిర్వహించబడతాయని అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి…

బర్త్ డే..మొక్కలు నాటిన ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి

ఆంధ్రా నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు

బీఆర్ఎస్‌ గెలిస్తే..పోలవరం పూర్తి

- Advertisement -