- Advertisement -
ఆదివాసీ గిరిజనుల దండారి ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయాలు మంజూరు చేసినట్లు ఆసిఫాబాద్ – కుమ్రం భీం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి తెలిపారు. ప్రతీ యేడు సంస్కృతీ, సాంప్రదాయాల ప్రకారం ఆసిఫాబాద్ – కుమ్రం భీం జిల్లాలో నిర్వహించే ‘దండారి’ ఉత్సవాలకు నిధులు మంజూరు చేసినందుకు సీయం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మేరకు గురువారం క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ పురాణం సతీష్, జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, నిర్మల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కె. విజయలక్ష్మి, టీఆర్ఎస్ నాయకురాలు సరస్వతీ, తదితరులు ఉన్నారు.
- Advertisement -