హుజుర్‌నగర్ ప్రజలకు ఋణపడి ఉంటా- సైదిరెడ్డి

562
mla saidireddy
- Advertisement -

సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సనంపూడి సైదిరెడ్డి రికార్డు విజయం సాధించారు. ప్రతి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యత చాటారు. 22 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపులో ఎక్కడా ఆయన వెనుక బడలేదు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి, మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు,ఎంపీలు,పట్టణ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

మీడియా సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. హుజుర్‌నగర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలకు శిరస్సు వంచి అభివాదం చేస్తున్నాము. విజయం కోసం కసితో కృషి చేసిన గులాబీ పార్టీ క్యాడర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మార్గదర్శనంలో పని చేసిన ఇంచార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి, మంత్రులు లకు, ఎమ్మెల్యే లకు, ఎమ్మెల్యేలకు, రాష్ట్ర నాయకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు. ఎమ్మెల్యేగా గెలిచిన సైదిరెడ్డికి అభినందనలు. సీఎం కేసీఆర్‌పై ప్రజలు అచెంచాలమైన విశ్వసాన్ని చాటారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సన్షేమ పథకాలకు ప్రజలు జై కొట్టిండ్రు. నోటికి వచ్చినట్లు ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడిన ఎక్కడ సంయమనం కోల్పోలేదు. ప్రజలే ప్రతిపక్ష లకు గుణపాఠం చెప్పాయి. కాంగ్రెస్ ,బీజేపీలు ఒక్కటై,సిద్ధాంతాలను వదిలి కుయుక్తులు పన్నిన అంతిమ విజయం టీఆర్‌ఎస్‌కె దక్కింది. ఈ నెల 26న సాయంత్రం 4 గంటలకు హుజుర్‌నగర్‌లో నిర్వహాస్తున్న కృతజ్ఞత సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారు. హుజుర్‌నగర్ ప్రజల సమస్యలపై స్పందిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఈ దెబ్బతో కాంగ్రెస్ పీడ విరగడ అయ్యింది. కాంగ్రెస్ కంచు కోటలను బద్దలు చేసాము. ప్రజలు అభిమానాన్ని చాటారు. సీఎం కేసీఆర్ వెంట నడిచారు.తిరుగులేని విజయాన్ని అందించారు.ఇక హుజుర్‌నగర్ దశ తిరుగుతుంది. అభివృద్ధికి ముఖ ద్వారంగా మారుతుందని మంత్రి మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

ఉప ఎన్నిక ఇంచార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై ప్రగాఢ విశ్వసాన్నిచాటుతూ హుజుర్‌నగర్ ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారు. హుజుర్‌నగర్ ప్రజలకు ధన్యవాదాలు. కాంగ్రెస్ అహంకారానికి ,అసత్య ప్రచారాలకు ప్రజలు చెంపపెట్టుగా విజ్ఞతతో తీర్పు చెప్పారు. సైదిరెడ్డి విజయం ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టు లాంటిదని పల్లా అన్నారు. ఈ నెల 26 న హుజుర్నగర్ లో నిర్వహించే విజయోత్సవ కృతజ్ఞత సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను ఎన్నో రకాలుగా మానసికంగా వేధించారు. ప్రజలు అన్ని గమనించి గొప్ప విజయాన్ని టీఆర్‌ఎస్‌కు అందించారు. విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు అని అన్నారు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి.

ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ.. నన్నుఎమ్మెల్యే గా గెలిపించిన ప్రజలకు ఋణపడి ఉంటాను.హుజుర్‌నగర్ అభివృద్ధి కోసం వచ్చిన ఈ ఎన్నికల్లో ప్రజలు చాలా గొప్పగా తీర్పు ఇచ్చారు. హుజుర్‌నగర్ సమగ్ర అభివృద్ధి కోసం పాటు పడుతాను. చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి హామీలను నెరవేరుస్తాను. హుజుర్‌నగర్‌ను అభివృద్ధికి ముఖ ద్వారంగా మారుస్తాను.

- Advertisement -