యాదాద్రి చరిత్రలో రికార్డు..

212
yadadri
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం మూడో ఆదివారం కావడడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆయల ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. ఇక స్వామివారి ఖజానాకు రికార్డు స్ధాయిలో ఆదాయం వచ్చింది. ఆదివారం ఒక్కరోజే రూ.1,09,82,446 ఆదాయం వచ్చింది.

వీఐపీ, బ్రేక్‌ దర్శనాల్లో భక్తులు అధిక సంఖ్యలో 2,317మంది పాల్గొన్నారు. ధర్మ దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ కాంప్లెక్స్‌ మూడు అంతస్తులతో పాటు క్యూలైన్లు నిండిపోయాయి. స్వామి వారి ధర్మదర్శానికి 8గంటలు, వీఐపీ దర్శనానికి 6గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.

ఇక ఇవాళ కార్తిక మాసం సోమవారం ఉదయం 11గంటల నుంచి 12.30గంటల వరకు కొండ కింద వ్రత మండపంలో కార్తిక తులసీ దామోదర వ్రతా లు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ ఎన్‌.గీత తెలిపారు. రూ.516 టికెట్‌తో భక్తులు వ్రతాల్లో పాల్గొనేందుకు వీలు కల్పించనున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -