వెంకటేష్ కుమార్తె అశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో మార్చి 24న రాజస్థాన్‌లోని జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు,సన్నిహితులు మాత్రమే హాజరుకాగా గురువారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని అనన్య కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ రిసెప్షన్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు,మెగాస్టార్ చిరంజీవి తదితరులు నూతన దంపతులను ఆశీర్వదించారు. రెబల్ స్టార్ క్రిష్ణంరాజు దంపతులతో పాటు అలనాటి హీరోయిన్లు రాధిక, జయసుధ, సుహాసిని, నదియా, టబు, ఖుష్బూ, మీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి అలనాటి హీరోయిన్లు దిగిన ఫొటో వైరల్‌గా మారింది. క ‘బాహుబలి’ ప్రభాస్ వెంకీ డాటర్ రిసెప్షన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.
అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు కూడా పాల్గొని నవ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రిసెప్షన్‌కు హాజరై నూతన వధువరూలను ఆశీర్వదించారు. దయాకర్ రావును ఆహ్వానిస్తూ ఆయన్ని వెంకటేష్ ఆలింగనం చేసుకున్నారు.