డేటింగ్ వార్తలన్నీ రూమర్సే..సీఎం వైఫ్‌.!

857
kiara advani dating
- Advertisement -

సూప‌ర్ మ‌హేశ్ బాబు న‌టించిన భ‌ర‌త్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన బ్యూటీ కైరా అద్వాని. త‌న గ్లామ‌ర్, అంద‌మైన న‌ట‌న‌తో కుర్ర‌కారు మ‌తిపోగొట్టేసిన కైరా ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

లైమ్ లైట్లో ఉన్నఈ హీరోయిన్‌పై పుకార్లు షికారు చేస్తున్నాయి. హీరోసిద్దార్థ్ మల్హోత్రాతో డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ రూమర్స్‌కు ఆదిలోనే చెక్ పెట్టేసింది కైరా. తానెవరితోనూ డేటింగ్ చేయట్లేదని, తాను ఇంకా సింగిల్‌గానే ఉన్నట్లు స్పష్టం చేసింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్నానని సమాధానమిచ్చింది.

భరత్ అను నేను తర్వాత రామ్ చరణ్‌తో వినయ విధేయ రామలో నటించింది కైరా. తర్వాత బాలీవుడ్‌లో ‘కళంక్‌’ సినిమాలో ఐటం సాంగ్‌ చేసిన ఈ బ్యూటీ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌, కరీనా కపూర్‌ నటిస్తున్న ‘గుడ్‌న్యూస్‌’ మూవీలో కీ రోల్ చేస్తోంది. రాజ్‌ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సెప్టెంబరులో విడుదల కానుంది.

- Advertisement -