టాలీవుడ్లో వరుస విజయాలతో స్పీడ్‌గా దూసుకువచ్చిన హీరో ఎవరు అంటే అందరూ ఖచ్చితంగా చెప్పే పేరు రాజ్ తరుణ్. గత కొంత కాలంగా సక్సెస్ బాటలో నడుస్తున్న రాజ్ తరుణ్. ”ఉయ్యాల జంపాల”, ”సినిమా చూపిస్త మావా”, ”కుమారి 21F”, ”ఈడో రకం ఆడో రకం” సినిమాల వరుస హిట్స్‌తో మంచి ఊపుమీదున్నాడు. ఈ కుర్ర హీరో ప్రస్తుతం మరో కొత్త సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇటీవల తెలుగునాట బాగా పాపులర్ అయిన యాంకర్లలో లాస్య ఒకరన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ తొలినాళ్ళల్లో యాంకర్ రవితో కలిసి అనేక కార్యక్రమాలు చేసి ప్రేక్షకుల మనసు దోచుకున్న లాస్య వివాహంపై గతంలో పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే. యాంకర్ రవిని లాస్య వివాహం చేసుకోబోతోంది అంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని, కేవలం తామిద్దరం మంచి స్నేహితులమని ఇద్దరూ బదులిచ్చుకోవడంతో, ఈ ప్రచారానికి తెరపడింది.
అయితే తాజాగా సోషల్ మరియు వెబ్ మీడియాలలో యాంకర్ లాస్య వివాహం గురించి మళ్ళీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సారి మరెవరితోనో కాదు, ఏకంగా తెలుగు సినీ వర్ధమాన హీరో రాజ్ తరుణ్ తో వివాహం జరిగిందని ప్రచారమవుతున్న వార్తల్లో వాస్తవం ఎంత ఉందో గానీ, వెబ్ & సోషల్ మీడియాలలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. రాజ్ తరుణ్ – లాస్యలు కలిసి ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ… వీరిద్దరూ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ఓ వైపు తన కెరీర్ ను గాడిలో పెట్టుకుంటూ హీరోగా రాజ్ తరుణ్ నిలబడడానికి ప్రయత్నాలు చేస్తుండగా, మరో వైపు యాంకర్ గా లాస్య బుల్లితెరపై సందడి చేస్తూనే ఉంది. అయితే శ్రీముఖి వంటి వారి ఎంట్రీతో గతంతో పోలిస్తే… లాస్య కార్యక్రమాలు తగ్గినప్పటికీ, ఇప్పటికీ డిమాండ్ ఉన్న యాంకర్లలో లాస్య ఒకరు. మరి ఈ ఇద్దరూ కలిసి రహస్య వివాహం చేసుకున్నారు అంటే ప్రేక్షకులకు అయితే నమ్మశక్యంగా లేదు. ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు పెదవి విప్పాల్సి ఉంది.