ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది టీడీపీ,వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శులు చేస్తూ ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. మరోవైపు ఎన్నికల వేళ వైసీపీ నేతలకు బెదిరింపు కాల్స్ వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సినీ నటుడు,వైసీపీ నేత మోహన్ బాబు తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అజ్ఞాత వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీలో చేరిన దగ్గర నుంచి ఈ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. మోహన్‌బాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
గత నెల 22న రాత్రి 30కి పైగా ఫోన్‌లు వచ్చినట్లు తెలుస్తోంది. సియోటెల్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా నుండి కాల్స్ వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.
ఇక గన్నవరం టీడీపీ అభ్యర్థి,సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎన్నికల వేళ గట్టిషాక్ తగిలింది. హైదరాబాద్ నాంపల్లి కోర్టు వంశీకి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2009లో వంశీపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో ఆగ్రహించిన న్యాయస్ధానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.