వైసీపీ ప్రచారంలో మంచు విష్ణు..రచ్చబండ

299
manchi vishnu
- Advertisement -

వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సినీ నటుడు,హీరో మంచు విష్ణు. రెండురోజులగా చంద్రగిరిలో వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విష్ణు..చంద్రబాబు,లోకేష్‌లపై విమర్శలు గుప్పించారు. చంద్రగిరిని అభివృద్ధి చేశానిన చెప్పుకుంటున్న చంద్రబాబు..లోకేష్‌ను మంగళగిరి నుండి ఎందుకు పోటీచేయిస్తున్నారని ప్రశ్నించారు.

నెలకు 10 రోజులు తిరుపతిలో ఉండే తమను చంద్రబాబు వలస పక్షులు అంటున్నారని ..ఏడాదికి ఒకరోజే నారావారిపల్లెకు వచ్చే ఆయన్ని ఏమనాలి అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ తమ బంధువని.. ఆయన విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారన్నారని తెలిపారు.

చెవిరెడ్డికి అండగా నిలవాలని ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు విష్ణు. రచ్చబండ దగ్గర స్థానికులతో సమావేశమవుతున్నారు. చంద్రగిరిలోనే మకాం వేసిన విష్ణు…వైసీపీ గెలుపు ఖాయమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

Image result for manchu vishnu ysrcp
- Advertisement -