భార్య శవాన్ని 10 కి.మీ మోసుకెళ్లిన భర్త

330
- Advertisement -

భారత దేశం అభివృద్దిలో పరుగులు పెడుతోంది…దేశానికి మేము ఎంతో చేశాం అంటే..కాదు మేమే దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం అని ఉపన్యాసాలు కొట్టే నాయకులు సిగ్గు పడాల్సిన విషయం ఇది. స్వాతంత్ర్యం వచ్చి 67 సంవత్సరాలు గడుస్తున్నా ఇదా మన పరిస్థితి ఇదా అనిపించే విషాదం. భుజంపై భార్య శవం… పక్కనే కన్నీటితో పన్నెండేళ్ల కూతురు..ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన హృదయ విదారక దృశ్యం ఇది.

మేఘారా అనే గ్రామంలో దనమాజి(42), అమాంగ్ దేయి గిరిజన దంపతులు. గత కొద్ది కాలంగా అమాంగ్ క్షయ వ్యాధితో బాధపడుతోంది. వారికి ఒక కూతురు కూడా ఉంది. ఇటీవల ఆ వ్యాధి ముదరడంతో చికిత్స కోసం 60 కిలోమీటర్ల దూరంలోని భవానిపాట్నా ప్రభుత్వ ఆస్పత్రికొచ్చారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రాణాలువిడిచింది. అయితే, ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏ ఒక్కరూ సహాయం చేయలేదు. ‘మహాపారాయణ’ అనే పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చనిపోయినవారి మృతదేహాలను వారి స్వగ్రామాలకు ప్రభుత్వం తరుపున ఉచితంగా చేర్చడం ఈ పథకం ఉద్దేశం.

download

తన భార్యను ఇంటికి తీసుకెళ్లడానికి పైసలు లేవని…మహాపారాయణ పథకం ద్వారా తీసుకెళ్లేందుకు సాయం చేయాలని అర్దించిన అధికారులు కనికరించలేదు. దీంతో ఎలాగైన శవాన్ని గ్రామానికి తీసుకెళ్లాలన్న ఆవేదన ఓ వైపు..మరో గుండెలు పగిలె కన్నీటిని దిగమింగుని భార్య శవాన్ని భుజాన వేసుకొని ఆస్పత్రి నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న తన ఊరుకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అలా పది కిలో మీటర్లు నడిచి వెళ్లాక ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకొని మిగితా 50 కిలోమీటర్లకు కలెక్టర్ వాహనం ఏర్పాటుచేశారు. ఘటనపై విచారణ జరిపి ఆస్పత్రి వర్గాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

odisha-man_650x400_61472063411

- Advertisement -