సంచలన వ్యాఖ్యలతో మీడియాలో కనిపించే జస్టిస్ మార్కండేయ కట్జూ.. పాకిస్థాన్‌కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ‘‘పాకిస్థానీలూ, మన వివాదాలకు శాశ్వతంగా తెర దించుదాం. మేం మీకు కశ్మీరు ఇస్తాం, కానీ దీనికి ఓ షరతు ఉంది, మీరు బిహార్‌ను కూడా తీసుకోవాలి, ఇది ప్యాకేజీ డీల్’’ అని తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో కట్జూపై చాలా మంది ఆగ్రహానికి గురవుతున్నారు. బిహార్‌ను చులకనగా చూస్తున్నారంటూ బీహార్ ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం బీజేపీ కూడా తీవ్రంగా విమర్శించింది. మరి కొందరు రాజకీయ నేతలు ఆయనపై దేశ ద్రోహం కేసు పెట్టి, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కట్జూ వ్యాఖ్యలకు బీహార్ సిఎం నితీష్ కుమార్ ఘూటుగానే స్పందించారు. ‘బిహార్.. నీ అమ్మా అయ్యల జాగీరా.. లేదా నీ జాగీరా’ అని ప్రశ్నించారు. బిహార్‌కు ఎన్నో ఏళ్ల చారీత్రక నేపథ్యం ఉందన్నారు. తాము బీహర్‌లో పుట్టినందుకు ఎంతో గర్విస్తున్నామని నితీష్ పేర్కోన్నారు. కొందరు పత్రికల్లో పబ్లిసిటీ కోసమే ఇలాంటి కామెంట్లు చేస్తారని తెలిపారు.
ఇక కట్జూ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. బిహార్ అంటే భారత దేశంలో అంతర్భాగమని, బిహారీలను అవమానిస్తున్నారని విమర్శిస్తున్నారు. ముందుగా జస్టిస్ కట్జూను పట్టుకెళ్ళిపోంటూ పాకిస్థానీలను కోరారు.
జస్టిస్ కట్జూ ప్రతిస్పందిస్తూ తాను నిజంగా పాకిస్థాన్‌కు ఈ ఆఫర్ ఇవ్వడం లేదని, కేవలం జోక్ చేశానని మరో ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాశారు. తనకు బిహారీలంటే ఎంతో గౌరవమని, గౌతమ బుద్ధుడు, చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు వంటి మహానుభావులు అక్కడ జన్మించారని పేర్కోంటూ నెటిజన్లను శాంతపరిచే ప్రయత్నం చేశారు.