టాలీవుడ్ మంచు లక్ష్మీ నిత్యం ట్రోల్స్ కు గురవుతుంటుంది. ఆమె లైట్ తీసుకొని ముందుకు సాగుతూ కనిపిస్తోన్న ఆమె ఫ్యాన్స్ మాత్రం సిరీయస్‌గా వార్నింగ్ ఇస్తుంటారు. తాజాగా హరిహర విరమల్లు కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తూన్న ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన వైసీపీ మధ్య రాజకీయ రగడ రాజుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీన్ని చూసి పవన్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం మీమ్స్ చేస్తూ కామెడీ చేస్తున్నారు. అయితే పవన్ ఫోటో పక్కన లక్ష్మీ ఫోటోను పక్కన పెట్టి మీమ్స్ తయారు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. కాగా తాజాగా మీమ్‌పై మంచు లక్ష్మి ప్రసన్న రెస్పాండ్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ పక్కన నా ఫోటో పెట్టడం నాకు సంతోషంగా అనిపిస్తోందంటూ మురిసిపోయింది. ‘గుడ్ లేదా బ్యాడ్.. ఏదైతేనేం నా ఫొటో పవన్ కళ్యాణ్ పక్కన ఉండటం థ్రిల్‌గా ఫీల్ అవుతున్నా’ అని క్యాప్షన్ పెట్టి ఆ మీమ్‌ను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్నాయి.
Good or bad I’m thrilled my pic is next to @PawanKalyan garu 🌺🙏☀️🧿🌞 https://t.co/CZC7iJsebd
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) December 14, 2022
ఇవి కూడా చదవండి…