వాల్తేరు వీరయ్య రన్ టైమ్ ఎంతంటే ?

53
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రం జనవరి 13, 2023న రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన సినిమా పోస్టర్, సాంగ్స్ సినిమాపై ఒక రేంజ్ లో హైప్ ని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ రన్ టైమ్ 2:13 గంటలుగా ఉండనుంది. 2 గంటల 13 నిమిషాలు అంటే.. తక్కువే. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల నిడివి 2 గంటల 30 నిమిషాలు కంటే తక్కువ ఉండటం లేదు. కానీ, మెగాస్టార్ సినిమా నిడివి మాత్రం 2:13 గంటలు మాత్రమే ఉండబోతుంది. మరీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడున్న బజ్ ను బట్టి
వాల్తేర్ వీరయ్య కు ఫుల్ క్రేజ్ ఉంది.

ఒక విధంగా నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే ఫుల్ హై ఉన్న సినిమా ‘వీర సింహ రెడ్డి’. ఒకపక్క ఈ సినిమా పోటీ పడుతున్నా.. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రం రెట్టింపు ఉత్సాహంతో పోటీలో దూసుకువెళ్తుంది. రవితేజ కూడా కీలక పాత్రలో కనిపించబోతుండటంతో ఈ సినిమా పై అన్నీ వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బాలయ్య సినిమా కంటే.. మెగాస్టార్ సినిమాకే మాస్ లో ఎక్కువ క్రేజ్ ఉండటం విశేషం.

అన్నిటికీ మించి మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మంచి ఊపు మీదున్నాడు. వరుస సినిమాలు చేస్తూ కొత్త మేకవర్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నారు. పైగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్య‌ధిక బడ్జెట్ తో వస్తోన్న మరో మల్టీస్టారర్ సినిమా ఇది. అందుకే, వ‌సూళ్లు పరంగా ఈ సినిమా సరికొత్త రికార్డును సృష్టించవచ్చు. బహుశా అందుకేనేమో మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా పై ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నారు. మరీ ఈ భారీ యాక్షన్ డ్రామా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

పొలిటికల్ థ్రిల్లర్ లో బాలయ్య

వైరల్ : రవి తేజ ఫోటో షూట్

ఈసారి రొమాంటిక్ బాలయ్య!

- Advertisement -