షారుఖ్‌కు షాక్‌…పఠాన్ బ్యాన్‌ నిజమెంత

168
- Advertisement -

బాద్‌షా నటించిన పఠాన్ సినిమాపై అనేకమంది విమర్శలు గుప్పిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్‌ టీజర్స్‌ విడుదలై మంచి రెస్పాన్స్‌ అందుకుంటుంది. ఈ క్రమంలో సినిమా యూనిట్ బేషరమ్ సాంగ్ విడుదల చేసింది. ఈ పాటలో దీపికా బికినీ డ్రెస్సులు ధరించి నర్తించిన వీడియోను పలువురు ప్రశంసిస్తున్నారు.

షారుఖ్‌ దీపికా కాంబినేషన్స్‌లో వస్తున్న మూడో సినిమాలో పూర్తిగా భిన్నత్వం కలిగి ఉంటుందని ఇప్పటికే సినిమా యూనిట్ ప్రకటించింది. కానీ ఇందులో షారుఖ్ దీపికా మధ్య కెమిస్ట్రీని చూసి ప్రేక్షకులు ఫిదా అవుతుంటే మరోకవైపు విమర్శలు గుప్పిస్తున్నారు.

సినిమాల కోసం, వ్యాపారం కోసం ఇంతలా దిగజారి సినిమా చేయాల్సిన అవసరం లేదని నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది జనవరిలో విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. కాగా సినిమాను బాయ్‌కట్‌ చేస్తే 2023లో విడుదల అయ్యే మొదటి సినిమా పఠాన్ నిలుస్తోందని బాలీవుడ్‌లో సమాచారం. పఠాన్ బ్యాన్‌ చేస్తే సంవత్సరం మొత్తం బాయ్‌కట్‌ల పర్వం కొనసాగుతుందని కొందరి క్రిటిక్స్‌ల అంచనా. ఇప్పటికే లాల్‌సింగ్ చడ్డా అమీర్‌ ఖాన్ సినిమా బాయ్‌కట్‌ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

డ్రైవర్ నుంచి గొప్ప డైరెక్టర్ వరకూ

వాల్తేరు వీరయ్య రన్ టైమ్ ఎంతంటే ?

వైరల్ : రవి తేజ ఫోటో షూట్

- Advertisement -