బోస్‌గా కాటమరాయుడు..!

324
Pavan dasari Narayana rao
Pavan dasari Narayana rao
- Advertisement -

దాసరి – పవన్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పవన్, దాసరిలు స్వయంగా ప్రకటించారు. అయితే ఈ కాంబినేషన్కు తగ్గ కథ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్భంగా తమ తారక ప్రభు ఫిలింస్ బ్యానర్లో 38వ సినిమాగా పవన్తో సినిమాను నిర్మిస్తున్నట్టుగా దాసరి యాడ్ కూడా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో తాజాగా దాసరి, బోస్ అనే టైటిల్ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించారు. దీంతో పవన్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు ఇదే టైటిల్ అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది.

అయితే తెలుగు సినిమాకు దాసరి నారాయణరావు పెద్ద దిక్కుగా చెబుతుంటారు. సినీఫీల్డ్ లో ఎంతోమందికి ఆయన లైఫ్ ఇచ్చారు. 1980లలో ఎన్టీఆర్ తో దాసరి తీసిన సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి నటరత్న రాజకీయ రంగ ప్రవేశానికి ఎంతగానో తోడ్పడ్డాయి. రామారావుకు ఆ సినిమాలు మాస్ లో పొలిటికల్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ కు కూడా దాసరి సినిమా ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. అయితే బోస్ అనే టైటిల్పై తారక ప్రభు ఫిలింస్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు.

- Advertisement -