తెలంగాణ వైపే అందరి చూపు…

239
- Advertisement -

యావత్ ప్రపంచం తెలంగాణ వైపే చూస్తోందన్నారు మంత్రి కేటీఆర్. ఫార్మా సిటీతో వచ్చే ఐదేళ్లలో 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.హైదరాబాద్ ఐటీసీ కాకతీయలో సీఐఐ ఆధ్వర్యంలో లీడర్‌షిప్ సిరీస్ ఆన్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ రిపోర్టును కెటిఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ ఉత్పత్తి రంగంలో సాధిస్తున్న ప్రగతితో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు.

Cqmg5TaW8AEOQT7

కొన్నాళ్లుగా సిఐఐ రాష్ట్రం ప్రభుత్వంతో కలిసి పని చేస్తోందన్నారు. ఉత్పత్తి రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోనే ఉత్పత్తి రంగంలో ముందున్నామని ఆయన చెప్పారు. పరిశ్రమలకు విద్యుత్ కోసం గతంలో ధర్నాలు జరిగేవి. మేము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఈ పరిస్థితికి చరమగీతం పాడినమి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. దేశంలోనే అత్యుత్తమైన ఇండస్ట్రీయల్ పాలసీని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో పెద్ద సంస్థలు ముందుకొచ్చాయి. యావత్ ప్రపంచం తెలంగాణ వైపే చూస్తోందని స్పష్టం చేశారు. ఇంటింటికీ సురక్షిత మంచి నీళ్లు ఇచ్చేందుకే మిషన్ భగీరథ ప్రాజెక్టు చేపట్టామని’ తెలిపారు.

- Advertisement -