టీమిండియా నెం 1

298
- Advertisement -

టెస్ట్‌ క్రికెట్‌లో టీమిండియా 112 పాయింట్లతో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం వెస్టీండిస్‌ వెళ్లిన కోహ్లీ సేన మరో టెస్ట్‌ మ్యాచ్ ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే టీమిండియాకు నంబర్ వన్ చేరడానికి కారణం మాత్రం ఆస్ట్రేలియానే. 118 పాయింట్లతో నంబ‌ర్ వ‌న్ టీమ్‌గా శ్రీలంక‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా.. వ‌ర‌స‌గా మూడు టెస్టుల్లో ఓట‌ముల‌తో 108 పాయింట్ల‌కు ప‌డిపోయింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు రెండోస్థానంలో ఉన్న భార‌త్ మ‌ళ్లీ నంబ‌ర్ వ‌న్ స్థానానికి ఎగ‌బాకింది. ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. ఇంగ్లాండ్‌తో 2-2తో సిరీస్‌ డ్రా చేసుకున్న పాకిస్తాన్‌(111) ఒక పాయింట్ తేడాతో రెండోస్థానంలో ఉంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్.. 4,5 స్థానాలు దక్కించుకున్నాయి. శ్రీలంక(6), దక్షిణాఫ్రికా(7), వెస్టిండీస్(8), బంగ్లాదేశ్(9), జింబాబ్వే(10) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అయితే టీమిండియా నాలుగో టెస్ట్‌లో గెలవకపోతే.. పాకిస్తాన్ తొలిసారిగా నంబ‌ర్ వ‌న్ ర్యాంకును సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం 112 పాయింట్లతో ఉన్న ఇండియా నాలుగో టెస్ట్‌ను డ్రా చేసుకుంటే 110 పాయింట్ల‌కు, ఓడితే 108 పాయింట్ల‌కు ప‌డిపోతుంది. అటు ఆస్ట్రేలియాపై క్లీన్‌స్వీప్ చేసిన శ్రీలంక ఆరోస్థానానికి ఎగ‌బాకింది.

- Advertisement -