చేనేతను ఆదుకోవాలి..

203
Kavitha
Kavitha
- Advertisement -

నేడు(ఆదివారం) హైదరాబాద్‌లో ఎన్ కన్వెన్షన్‌లోది వీవింగ్‌ జర్నీ పేరిట ఏర్పాటుచేసిన చేనేత ఉత్పత్తుల ఎగ్జిబిషన్‌ను ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. మళ్లీ మహాత్మాగాంధీ వచ్చి రాట్నం తిప్పితే తప్ప.. దేశంలో చేనేతరంగం అభివృద్ధి చెందేలా లేదని ఆమె అన్నారు. భారత్‌లో చేనేత పరిశ్రమను పట్టించుకోవడం లేదని.. వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని కవిత అభిప్రాయపడ్డారు.

రజనీ శారీస్‌, సైబర్‌ సిటీ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ సహకారంతో ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారుల వస్త్రాలు, నేత వస్త్రాలతో రూపొందించిన సరికొత్త ఫ్యాషన్‌ దుస్తులు కొలువుదీరాయి. ఈ కార్యక్రమంలో కవితతో పాటు పురంధేశ్వరి, డీకే అరుణ, ఉమారెడ్డి, నాగసుశీల, పింకీరెడ్డి, మోడల్‌ శిల్పారెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

mp kavitha

kavitha mp

- Advertisement -