వచ్చే ఏడాదిలోనే… పెళ్లి

200
samantha naga
- Advertisement -

వచ్చే ఏడాది అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది సమంతను పెళ్లి చేసుకోనున్నట్లు కథానాయకుడు నాగచైతన్య చెన్నైలో శనివారం తెలిపారు. ఈ నెల 24 నుంచి కొచ్చిలో ప్రారంభం కానున్న సెలెబ్రిటీ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో పోటీ పడుతున్న ‘టాలీవుడ్‌ థండర్స్‌’ జట్టుకు నాగచైతన్య బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ జట్టు పరిచయ కార్యక్రమం శనివారం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో నాగచైతన్యతో పాటు జట్టు యజమానులు నందిని విజయ్‌, సాగర్‌, జట్టు సభ్యులు పాల్గొని జట్టు జెర్సీని నాగచైతన్య ఆవిష్కరించారు.

naga chaitanya

ఈ సంధర్బంగా చైతన్య మాట్లాడుతూ ‘‘చెన్నైతో నాకు మంచి అనుబంధం ఉంది. 18 ఏళ్లపాటు ఇక్కడే పెరిగాను. పాఠశాల విద్య ఇక్కడే పూర్తి చేశాన’’న్నారు. సమంతతో వివాహానికి ముహూర్తం ఎప్పుడని అడగ్గా.. సమంతతో మీ పెళ్లి ఎప్పుడూ అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. ప్రస్తుతానికి డేట్ ఫిక్స్ అవ్వలేదు. వచ్చే ఏడాదిలో ఉంటుంది అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో అఖిల్ నిశ్చితార్ధం ముందుగా జరిగిన నాగచైతన్య పెళ్లి తరువాతే అఖిల్ పెళ్లి ఉంటుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

- Advertisement -