గణనాథునికి 29,465 కేజీల ల‌డ్డూ

207
- Advertisement -

పల్లెల్లో, పట్నాల్లో ఏ వీధి చూసినా లంబోదరుడి విగ్రహ మంటపాలతో కోలాహలమే కనిపిస్తోంది. విభిన్న ఆకృతుల్లో ఉన్న బొజ్జ గణపయ్య భక్తజనాన్ని కనువిందు చేస్తున్నాడు.గ‌ణ‌నాధుడికి భ‌క్తులు భారీ కానుక‌లు స‌మ‌ర్పిస్తున్నారు. రాష్ట్రంలో ప్ర‌త్యేక‌మైన ఖైర‌తాబాద్ గ‌ణేష్ ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. 500 కిలోల భారీ ల‌డ్డూను గణనాథుని కోసం తయారుచేశారు.

ఈసారి తాపేశ్వ‌రానికి చెందిన శ్రీ భ‌క్తాంజ‌నేయ సురుచి ఫుడ్స్ భారీ ల‌డ్డూను త‌యారు చేసింది. విశాఖ‌ప‌ట్ట‌ణంలోని గాజువాక‌లో ఏర్పాటు చేసిన 78 అడుగుల విఘ్నేశుడికి ఆ ల‌డ్డూను నైవేద్యంగా స‌మ‌ర్పించారు. గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించిన ఆ ల‌డ్డూ 29,465 కేజీల బరువు ఉంది. సుమారు రూ.50 ల‌క్ష‌ల ఖ‌ర్చుతో ల‌డ్డూను త‌యారు చేశారు. ల‌డ్డూను త‌యారు చేసేందుకు 20 మంది స‌భ్యులు దాదాపు 20 గంట‌లు ప‌నిచేయాల్సి వ‌చ్చింది.

lord Ganesha

గ‌త ఏడాది గుజ‌రాత్‌లోని అర‌సూరి అంబాజీ మాతా దేవ‌స్థానం ట్ర‌స్టు గ‌ణేశుడికి 11,115 కేజీల ల‌డ్డూను స‌మ‌ర్పించారు. ఆ రికార్డును సురిచి పుడ్ కంపెనీ ఇప్పుడు బ్రేక్ చేసింది. 45 శాతం చ‌క్కెర‌, 23 శాతం శెన‌గ ప‌ప్పు, 27 శాతం నెయ్యి, 5 శాతం డ్రై ఫ్రూట్స్‌తో తాపేశ్వ‌రం భారీ ల‌డ్డూను త‌యారు చేశారు. విశాఖ సంక్షేమ సంఘం ఈ ల‌డ్డూను లంబోదరునికి స‌మ‌ర్పించింది. ఈ ల‌డ్డూను బుధ‌వారం నుంచి భ‌క్తుల‌కు పంచి పెట్ట‌నున్నారు. భారీ ల‌డ్డూను త‌యారు చేసి సురుచి పుడ్స్ గిన్నిస్ బుక్స్‌లో చోటు సంపాదించ‌డం ఇది అయిద‌వ సారి అని ఆ సంస్థ ఓన‌ర్ మ‌ల్లిఖార్జున్‌ రావు తెలిపారు.

- Advertisement -