ఆడవాళ్లకు ఎక్కువగా వచ్చే కల ఏదంటే!

579
- Advertisement -

కలలు కనడం మానవ సహజం. చిన్న,పెద్ద అని తేడా లేకుండా అందరికీ కలలు వస్తాయి. పడుకునేటప్పుడు సంతోషంగా ఉంటే ఒకలాగా,విషాదంగా ఉన్నప్పుడు పడుకుంటే వచ్చే కలలు మరో విధంగా ఉంటాయి. కలలు వచ్చినప్పుడు వాటిలో అనేక దృశ్యాలు కనిపిస్తాయి. కొన్ని మంచి కలలు ఉంటే…మరికొన్ని పీడకలలా వేదిస్తుంటాయి. అయితే మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లకు రాత్రిళ్లు పీడకలలు ఎక్కువగా వస్తాయి.

ఆడవాళ్లను బాగా ఇబ్బందిపెట్టే పీడకలల్లో మొదటిది జీవిత భాగస్వామి తమని మోసం చేస్తున్నాడనేది. ఆ తరువాతి స్థానాల్లో పళ్లు ఊడిపోతున్నట్టు, ఎవరో వెంటాడుతున్నట్టు, సాలెపురుగులు కనిపించడం వంటివి ఉన్నాయి. ఆ కలలు కూడా భావోద్వేగాలకు సంబంధించి, చాలా తీవ్రంగా ఉంటున్నాయని ఒక స్టడీలో వెల్లడైంది. వెంటాడుతున్నట్టు వచ్చే కలలు 51 శాతం కాగా, స్కూల్లో వెనకబడినట్టు 38 శాతం, పరీక్షకు లేదా ముఖ్యమైన ఈవెంట్‌కు ప్రిపేర్‌ కానట్టు 34 శాతం కలలు వస్తుంటాయి.

dreams

‘పీడకలలు అనేవి ఆందోళన నుంచి వస్తాయి. ఆడవాళ్లకు పీడకలలు ఎక్కువగా రావడానికి వాళ్లు ఎక్కువగా యాంగ్జైటీ డిజార్డర్ల బారిన పడడమే ప్రధాన కారణం’’ అంటున్నారు యుఎస్‌కు చెందిన సైకోఎనలిస్ట్‌ అన్నె కట్లర్‌. మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు తమ పీడకలలను బాగా గుర్తుంచుకుంటారని కూడా అంటోంది ఈ స్టడీ. తమకొచ్చే కలలను పావువంతు మంది ఆడవాళ్లు 24 శాతం గుర్తు పెట్టుకుంటుంటే, మగవాళ్లలో ఈ గుర్తుపెట్టుకోవటం 14శాతంగా ఉంది. ఈ స్టడీని మగ, ఆడ కలిపి రెండువేలమంది మీద చేశారు.

ladies dreams

భర్త తమను మోసం చేశాడని కలగనడంతోపాటు నోట్లోని దంతాలు ఊడిపోయినట్లు, ఎవరో తమను వెంటాడుతున్నట్లు, సాలెపురుగులను చూస్తున్నట్లు ఆడవాళ్లకు కలలు వస్తాయట. ప్రిపేర్ కాకుండానే పరీక్ష రాస్తున్నట్టు కూడా వారు కలగంటారట. సగం మందికిపైగా ఆడవాళ్లకు ఎవరో తరుముతున్నట్లు కలలు వస్తాయని తేలింది. మహిళల్లో ఆందోళన ఎక్కువగా ఉండటంతో ఇలాంటి కలలు వస్తాయని ఆ సర్వేలో తేలింది.

dreams

- Advertisement -