‘మీటింగ్ టైమ్’ బీజేపీలో కలవరం పోతుందా?

36
- Advertisement -

కర్నాటక ఎన్నికల ముందు బీజేపీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఎన్నికలు జరగను లేదు.. ఫలితాలు వెలువడను లేదు కానీ ముందుకు ముందే తమదే గెలుపని, రాష్ట్రంలో తమకు తిరుగే లేదని జబ్బలు జరుస్తూ మీసాలు మేలేశారు. తీర ఎన్నికలు జరిగి ఫలితాల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. అనుకున్నదొకటి అయినది ఇంకొకటి అన్నట్లుగా ఘోర ఓటమిని బీజేపీకి అంటగట్టారు కన్నడిగులు. దెబ్బకు ఆ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన షాక్ తో ఇటు తెలంగాణలో కూడా బీజేపీ ప్రణాళికలు తారుమారయ్యాయి. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో కూడా గెలుపు మాదే అని చెప్పిన కషాయ దళం ఇప్పుడలా చెప్పే పరిస్థితిలో లేదు. .

గెలుపు సంగతి అటుంచితే ముందు పార్టీ బలం ఎంత వరకు ఉందనే సందేహాలు మొదలయ్యాయి. కర్నాటకలో మాదిరి తెలంగాణలో కూడా బీజేపీ పై పై హంగమనే తప్ప లోపల మ్యాటర్ లేదనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న అభిప్రాయం. దాంతో తెలంగాణలో పార్టీ బలాన్ని ఒకసారి రీచెక్ చేసుకునేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే నేడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు కమలనాథులు. ఈ సమావేశంలో పార్టీ బలం ఎంతమేర ఉంది ? వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అమలు చేయాల్సిన వ్యూహాలు ఏంటి ? అసలు క్షేత్ర స్థాయిలో పార్టీకి ఆధారణ ఉందా ? లేకపోతే ఏం చేయాలి ? ఇలా చాలా అంశాలనే చర్చకు తీసుకురనున్నారట.

Also Read:ఓటీటీ : ఏ చిత్రం ఎందులో ?

అంతే కాకుండా గత కొన్నాళ్లుగా అధ్యక్ష పదవి మార్పు పై కూడా గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. బండి సంజయ్ స్థానంలో ఈటెల రాజేంద్రను బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని పోలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న మాట. ఈ కార్యవర్గ సమావేశంలో పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుంగ్ పాల్గొననున్నారు. దాంతో ప్రస్తుతం డీలా పడ్డ కమలనాథులకు ఆయన ఎలాంటి సూచనలు ఇస్తారు ? అధ్యక్ష పదవి మార్పుపై బండి సంజయ్ ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా ? ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి కర్నాటక ఎఫెక్ట్ తో తెలంగాణలో కూడా కలవరనికి గురవౌతున్న కషాయ దళం ఈ కార్యవర్గ సమావేశంలో ఎలాంటి వ్యూహాలకు పదును పెడుతుందో చూడాలి.

Also Read:IPL 2023:ప్లే ఆఫ్స్‌కు ముంబై

- Advertisement -