కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ కి పెద్దగా పనేం ఉండదు. తెరపై పరిధకి మించి అందాలు ఆరబోస్తే చాలు. అలాగే ఆరు పాటల్లో అలా కనిపించి వెళ్లిపోతే చాలు. సహజంగా హీరోయిన్ పని అయిపోతుంది. ఇక సదరు హీరోయిన్ మళ్లీ డబ్బింగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు చిత్రాల కమర్షియల్ హీరోయిన్ వర్క్ ఇలాగే ఉంటుంది. అయితే ఈ హీరోయిన్లలోనే సాయి పల్లవి, రష్మీక మందన్నా లాంటి కొందరు హీరోయిన్లు ఉంటారు. వీళ్ళు ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటారు. తక్కువ కాలంలోనే తమకు ఛాన్స్ ఇచ్చిన భాషను నేర్చుకోవడమే కాదు, ఎంతో కష్టపడి తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటూ ఉంటారు.
ఇప్పుడు ఈ లిస్ట్ లోనే నిలుస్తోంది హీరోయిన్ కృతి శెట్టి. ప్రస్తుతం చైతు సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని తన సత్తా చూపించింది కృతి. అందులోనూ పక్కా తెలంగాణ స్లాంగ్ ను పలకడానికి కృతి శెట్టి బాగా కష్టపడింది. ఈ విషయంలో రష్మీక మందన్నా కన్నా.. కృతి శెట్టికు ఎక్కువ మార్కులు పడతాయి. నిజానికి సాయి పల్లవి సొంతగా డబ్బింగ్ చెప్పుకుని బాగా సక్సెస్ అయింది.
రష్మీక ఈ విషయంలో సాయి పల్లవిని ఫాలో అయింది. ఇప్పుడు కృతి శెట్టి కూడా సాయి పల్లవిని ఫాలో అవుతుంది. కొన్ని కన్నడ చిత్రాల్లో కూడా కృతి శెట్టి నటిస్తోంది. కన్నడ సినిమాలకు కూడా కృతి శెట్టి తన సొంత వాయిస్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ డబ్బింగ్ వ్యవహారం కృతి శెట్టి అంకితభావానికి నిదర్శనం అనే చెప్పాలి. పైగా కృతి శెట్టికి ఈ డబ్బింగ్ బాగా ప్లస్ కానుంది.
ఇవి కూడా చదవండి…