వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు ప్రముఖ నటుడు జీవితా రాజశేఖర్ దంపతులు వారిద్దరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. ఈసందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ…చాలా రోజుల తర్వాత వైఎస్ జగన్‌ను కలిశాను. మా మధ్య ఉన్న కొన్ని మనస్పర్థలు ఉన్న మాట వాస్తవేమని..ఇవాళ్టీతో అవన్ని తొలగిపొయాయన్నారు. అప్పట్లో నేను అపరిపక్వతతో ప్రవర్తించాను.
నాకు శత్రుత్వం లేదు, కానీ ఎందుకో మనస్పర్థలు ఉన్నాయి. అవి తొలగించుకోవడానికే ఆయన దగ్గరకు వచ్చానన్నారు. ఒకప్పటి జగన్ వేరు ఇప్పడున్న జగన్ వేరు అని…ఆయనలో చాలా మార్పు వచ్చిందన్నారు. ఆంధ్ర ప్రజలు జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చే చీరలు, డబ్బులకు ఆశపడి ఓట్లు వేయోద్దని జగన్ లాంటి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు జీవిత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ బాగుండాలని జగన్ సీఎం కావాలన్నారు. ఆరోగ్య శ్రీ పథకంతో పాటు రైతులకు వైఎస్ ఎంతో మేలు చేశారని, ప్రజల మనసుల్లో ఉండిపోయారని వ్యాఖ్యానించారు.