నాని నటించిన పిల్ల జమీందార్ సినిమా చూశారు కదా.. అందులో రాత్రి వేళల్లో బస్సుకు గేదెలు అడ్డు వస్తున్నాయని ఏం చేశాడో అందరికి తెలిసిందే. గేదెల కొమ్ములకు రేడియం స్టిక్కర్లు వేస్తాడు. దీంతో రాత్రి సమయంలో బస్సు హెడ్ లైట్ వెలుతురులో ఆ రేడియం మెరుపుతో డ్రైవర్ అలర్ట్ అయి బస్సు అపుతాడు. గేదెలు వెళ్లాక బస్సు ముందుకెళ్తుంది.. అయితే ఇదే ఐడియాను మధ్య ప్రదేశ్ పోలీసులు కూడా ఫాలో అవుతున్నారు.
రాత్రి వేళల్లో వాహానాల క్రింద పడి గోవులు చనిపోతుండడంతో రోడ్లపై ఉండే గోవులు రాత్రి వేళల్లో వాహాన దారులకు కనిపించేలా రేడియం స్టిక్కర్లను కొమ్ములకు చుట్టి వాటి ప్రాణాలను కాపాడెందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రి వేళల్లో డ్రైవర్లను హెచ్చరించేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇది వరకు బండ్లకు, వాహానాలకు మాత్రమే ఈ రేడియం స్టిక్కర్లను వాడేవారు. ఆవుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుండడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. అయితే ఈ రేడియం ఎక్కువ రోజులు ఉండకపోవడం సమస్యగా మారిందని పోలీసులు చెబుతున్నారు. ఏది ఎలా ఉన్నా.. గోవుల సంరక్షణ కోసం మధ్య ప్రదేశ్ పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలకు సెల్యూట్ చేయాల్సిందే..